Tamanna | పీకల్లోతు ప్రేమలో ఉన్నాం
కథానాయిక తమన్నా, నటుడు విజయ్ వర్మ రియల్ లవ్‌స్టోరీ ఇప్పుడు హాట్‌టాపిక్. ఈ జంట తమ ప్రేమను బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. అంతేకాదు ఇద్దరు గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారు.
కథానాయిక తమన్నా, నటుడు విజయ్ వర్మ రియల్ లవ్‌స్టోరీ ఇప్పుడు హాట్‌టాపిక్. ఈ జంట తమ ప్రేమను బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. అంతేకాదు ఇద్దరు గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇప్పటి వరకు పలు ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి చెబుతూనే వున్నారు. తాజాగా విజయ్ వర్మ మరోసారి ఈ విషయంపై మాట్లాడారు. ‘మా లవ్‌స్టోరీ గురించి, మా గురించి తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా వున్నారు. అందరి ఆదరణ, అభినందనలు పొందిన జంటల్లో మేము కూడా వున్నామనేది నాకు ఇప్పటి వరకు తెలియదు. అంత మంది ఆదరణ సొంతం చేసుకున్నందుకు సంతోషంగా వుంది.
మేమిద్దరం ప్రేమలో పడిన కొత్తలో బయటికి వెళ్లినప్పుడు అందరి దృష్టి మా మీద పడటం, వ్యక్తిగత జీవితం అందరిలో డిస్కషన్ పాయింట్‌గా వుండటం అసౌకర్యంగా ఫీలయ్యా.రాను రాను నేను కూడా దానికి అలవాటుపడ్డాను. ఏది ఏమైనా తమన్నాతో నేను పీకల్లోతు ప్రేమలో మాత్రం వున్నాను’ అని విజయ్ చెప్పుకొచ్చారు. ‘విజయ్ తన జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అని, నాకు కష్టం వస్తే నాతోనే వుంటాడనే నమ్మకం వుందని’ తమన్నా పలు సార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

