Thalapathy 68 | విజయ్ న్యూ లుక్ వైరల్.. దళపతి 68 నుంచి క్రేజీ అప్డేట్స్
Thalapathy 68 | వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న దళపతి 68 (Thalapathy 68)కు సంబంధించి ఏదో ఒక అప్డేట్తో అందరినీ ఖుషీ చేస్తోంది విజయ్ టీం. తాజాగా విజయ్ న్యూ లుక్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
Thalapathy 68 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఓ వైపు లియోతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. కాగా మరోవైపు వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో వస్తోన్న దళపతి 68 (Thalapathy 68)కు సంబంధించి ఏదో ఒక అప్డేట్తో అందరినీ ఖుషీ చేస్తోంది విజయ్ టీం. తాజాగా విజయ్ న్యూ లుక్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. విజయ్ యూకే డిస్ట్రిబ్యూటర్ విథుర్స్తో దిగిన స్టిల్‌ను షేర్ చేయగా.. దళపతి 68లో విజయ్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కన్నడ యాక్టర్ జయరాయ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ప్రస్తుతం జయరామ్, విజయ్ కాంబో సీన్లను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ ఇద్దరూ గతంలో తుపాకి సినిమాలో నటించారు. దళపతి 68 షూటింగ్‌ను నెక్ట్స్ సౌతాఫ్రికాలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఫస్ట్ షెడ్యూల్లో భాగంగా ఏఐ టెక్నాలజీతో ఓ పాటను షూట్ చేయబోతున్నారని, ఈ పాట కోసం భారీ సెట్ కూడా వేశారని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
దళపతి 68లో అలనాటి అందాల హీరోయిన్ జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మీనాక్షి చౌదరి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో పాన్ ఇండియా స్టోరీతో రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్లో నటిస్తున్నాడని సమాచారం.
గ్రాండ్‌గా దళపతి 68 పూజా కార్యక్రమం నిర్వహించగా.. పూజా ఈవెంట్ ఫొటోలు, వీడియోలను మేకర్స్ లియో రిలీజ్ తర్వాత షేర్ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) విలన్‌గా మెరుబోతున్నాడని వార్తలు వస్తుండగా.. రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది దళపతి 68 టీం. ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
#Thalapathy68 – Does this look need a De-Aging technology..❓ pic.twitter.com/4UDHOylqHd
— Laxmi Kanth (@iammoviebuff007) October 17, 2023
Jayaram – Thalapathy Vijay combination scenes in #Thalapathy68 🤝, shoot going on… pic.twitter.com/7pSxwOYRaz
— AB George (@AbGeorge_) October 17, 2023
దళపతి 68 ఈవెంట్ అప్డేట్..
#Thalapathy68 : Pooja Done⭐
• Full Fledged Shoot Starts From Tomorrow (OCTOBER 3)🔥
• Shoot Starts With Song Portion Using AI Technology😎
• To Show Young #ThalapathyVijay ❤️
• Pooja Video & Still Will Be Released After Release Of #LEO 🤝🏾#YuvanShankarRaja | #VenkatPrabhu— Saloon Kada Shanmugam (@saloon_kada) October 2, 2023
లాస్ ఏంజెల్స్‌లో విజయ్..
Welcome to the future!!! #Thalapathy68 @actorvijay @archanakalpathi pic.twitter.com/snWrqMEjfU
— venkat prabhu (@vp_offl) August 31, 2023
ఎయిర్‌పోర్టులో విజయ్..
Thalapathy Tharisanam 💙#ThalapathyVijay & the #Thalapathy68 team, accompanied by @vp_offl & @archanakalpathi, arrived at Los Angeles International Airport ✈️ (LAX) at 12:30 AM today. They traveled from Chennai to Los Angeles via Singapore & Tokyo on Singapore Airlines Flight. pic.twitter.com/HgzLX5FHGW
— KARTHIK DP (@dp_karthik) August 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

