Vijay | దశాబ్ధానికిపైగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన స్టార్ యాక్టర్, టీవీకే చీఫ్ విజయ్ తమిళ రాజకీయాల్లో కొత్త శకాన్ని ప్రారంభించాడని తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ విజయాన్ని నమోదు చేసి తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ క్రేజ్ ధాటికి తమిళనాడు ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
తాజాగా అరుదైన ఫీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు విజయ్. ఐఎండీబీ (Internet Movie Database) మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో విజయ్ రెండో స్థానంలో నిలిచాడు. గతంలో విజయ్ ఐఎండీబీ జాబితాలో 21వ స్థానంలో నిలిచిన విజయ్.. ఈ సారి ఏకంగా 2వ స్థానంలో నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. Sapne vs Everyone సిరీస్‌తో అందరినీ అలరించిన అంబరీష్ వర్మ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.
దళపతి విజయ్ చివరి సినిమా జననాయగన్ త్వరలోనే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. హెచ్ వినోథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పలు రకాల సెన్సార్ చిక్కులను దాటుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
New week, new faces at the top of Popular Indian Celebrities! 🌟
See the complete list on the IMDb app, available on iOS and Android. 🍿 pic.twitter.com/DaRJQtoPRq
— IMDb India (@IMDb_in) May 12, 2026
Satyavathi Rathod | పబ్బులు, క్లబ్బుల్లో గొడవలప్పుడే బుద్ధి చెప్పాల్సి ఉండే : సత్యవతి రాథోడ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు