ఊహించని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతూవుండటం ఇండస్ట్రీలో కామన్. తాజాగా అగ్ర హీరో విజయ్ దేవరకొండ, ‘బేబీ’ దర్శకుడు సాయిరాజేష్ కాంబినేషన్లో సినిమా రానున్నదంటూ ఓ వార్త ఫిల్మ్ వర్గాల్లో బాగా వినిపిస్తున్నది. యువతలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఇక ‘బేబీ’ సినిమాలో ప్రజెంట్ జనరేషన్ ఎమోషన్స్‌ని దగ్గరగా చూపించి యూత్‌కి బాగా చేరువయ్యారు సాయిరాజేశ్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. మరి విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాకు సాయిరాజేష్ ఏ తరహా కథను ఎంచుకున్నారో తెలియాల్సివుంది. మైత్రీమూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతున్నది.