టాలీవుడ్ హీరో విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) కు మార్వెల్ కామిక్స్ పాత్ర వీనమ్ (Venom)అంటే చాలా ఇష్టం. తాజాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. మొదట విజయ్ రౌడీ క్లబ్ జాకెట్ విప్పాడు. ఆ తర్వాత టీ షర్ట్, షార్ట్స్ ను ఒక్కోటి విప్పేశాడు. ఆ తర్వాత హెయిర్‌ను పుల్ అప్ చేస్తూ వీనమ్ గెటప్‌లోకి మారిపోయిన వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మీలో ఉన్న మృగాన్ని వదలండి అంటూ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చాడు.
మీరు ఉత్తమంగా కనిపించాలనుకోవడం లేదు..అంటూ వీడియోపై కనిపిస్తుండటం చూడొచ్చు. అక్టోబర్ 14న Venom: Let There Be Carnage విడుదల కాబోతుంది. విజయ్ దేవరకొండ విడుదల చేసిన తాజా వీడియో హాలీవుడ్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. సినిమాస్ పిలుస్తున్నాయి..సురక్షితంగా ఉండండి..క్రేజీ రైడ్‌ను ఎంజాయ్ చేయండి అంటూ సూచించాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్