The Girlfriend | పుష్ప 2 ది రూల్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది నేషనల్ క్రష్, కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ లీడ్ రోల్లో నటిస్తోన్న సినిమా ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend). టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీకి స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ సపోర్ట్ ఇవ్వబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో అందరి ఫోకస్ తన వైపు తిప్పుకుంటున్న రష్మిక ఇక టీజర్‌తో సందడి చేయనుంది. ఈ మూవీ టీజర్‌ను రౌడీబాయ్ రేపు (డిసెంబర్ 9)ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
బాయ్‌ఫ్రెండ్ విజయ్ దేవరకొండ రష్మిక టీజర్ లాంచ్ చేస్తుండటంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇంతకీ టీజర్ఎలాంటి కంటెంట్ ఉండబోతుందనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
ఈ చిత్రంలో చికాగో భామ అనూ ఇమ్మాన్యుయేల్ కీ రోల్లో నటిస్తుండగా.. కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్‌పై అంచనాలు ఆరీగానే ఉన్నాయి.
Heartthrob @TheDeverakonda will introduce #TheGirlfriend to the world ❤🔥#TheGirlfriendTeaser, out on December 9th at 11:07 AM ✨@iamRashmika @Dheekshiths @23_rahulr @GeethaArts #AlluAravind @SKNOnline #VidyaKoppineedi @DheeMogilineni @HeshamAWMusic @MassMovieMakers… pic.twitter.com/qNEYBCbK4d
— BA Raju’s Team (@baraju_SuperHit) December 8, 2024
Fahadh Faasil | ఎక్జయిటింగ్ అనిపించిందే చేశానంటున్న పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్