‘రణబాలి’తో వారందరికీ సమాధానమిస్తా..
‘పండుగ మొదలైంది. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు, బెజవాడలో శరన్నవరాత్రులు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు స్టార్టయ్యాయి. పిల్లలకు సెలవులిచ్చారు. ఈ నెల 16న తెలుగు సినిమా గర్వపడేలా ‘రణాబాలి’ రానుంది. థియేటర్లన్నీ పండుగ సంబురాలతో కళకళలాడాలి. ఈ కథ కోసం ఓ రీసెర్చే చేశారు రాహుల్ సంకృత్యాన్. ఓ పీరియడ్ యాక్షన్ సినిమాను చూపిస్తూ, మరుగున పడ్డ చరిత్రను తెరపై ఆవిష్కరించాడు. 150 ఏండ్ల క్రితం బ్రిటిషర్స్ వల్ల వచ్చిన మహాకరువు లక్షలమంది చావులకు కారణం అయ్యింది. ప్రస్తుతం కూడా ఎల్‌నినో వల్ల కరువు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
‘పండుగ మొదలైంది. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు, బెజవాడలో శరన్నవరాత్రులు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు స్టార్టయ్యాయి. పిల్లలకు సెలవులిచ్చారు. ఈ నెల 16న తెలుగు సినిమా గర్వపడేలా ‘రణాబాలి’ రానుంది. థియేటర్లన్నీ పండుగ సంబురాలతో కళకళలాడాలి. ఈ కథ కోసం ఓ రీసెర్చే చేశారు రాహుల్ సంకృత్యాన్. ఓ పీరియడ్ యాక్షన్ సినిమాను చూపిస్తూ, మరుగున పడ్డ చరిత్రను తెరపై ఆవిష్కరించాడు. 150 ఏండ్ల క్రితం బ్రిటిషర్స్ వల్ల వచ్చిన మహాకరువు లక్షలమంది చావులకు కారణం అయ్యింది. ప్రస్తుతం కూడా ఎల్‌నినో వల్ల కరువు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అందుకే నీళ్లను జాగ్రత్తగా వాడదాం. ఎన్ని కష్టాలనైనా అధిగమించే శక్తి భారతీయులకు మొదట్నుంచీ ఉంది.
నా ‘నోటా’ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో అప్పట్లో కొందరు నన్ను ట్రోల్ చేశారు. అప్పుడు రాహుల్ సంకృత్యాన్ ‘ట్యాక్సీవాలా’తో వాళ్లందరికీ సమాధానమిచ్చా. ప్రస్తుతం మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇప్పుడు రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’తో వస్తున్నా. ఈ సారి కూడా వారందరికీ సమాధానమిస్తా. నటీనటులు, సాంకేతికనిపుణులు అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇక రష్మిక ఈసినిమాకు అవసరం. తను మాత్రమే ఈ పాత్ర చేయగలదు. తను ఈ సినిమాలోకి, నా జీవితంలోకి రావడం నా అదృష్టం’ అని అగ్ర కథానాయకుడు దేవరకొండ విజయ్ అన్నారు.
ఆయన హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రష్మిక మందన్న కథానాయిక. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం విజయదశమి కానుకగా ఈ నెల 16న విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడారు.
రష్మిక మదన్నా మాట్లాడుతూ ‘మనకు తెలియని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ‘రణబాలి’. ఈ టీమ్ పడ్డ కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని నేను. ఇది లవ్‌స్టోరీ కాకపోయినా.. ఇందులో లవ్‌ట్రాక్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది’ అని చెప్పారు. విజయ్ దేవరకొండ విశ్వరూపం ఇందులో చూస్తారని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ అన్నారు. ఇంకా చిత్రబృందంతో పాటు ప్రముఖ దర్శకులు హరీశ్‌శంకర్, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, బుచ్చిబాబు, రవికిరణ్ కోలా, రాహుల్ రవీంద్రన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

