Family Star | ఫ్యామిలీ జోలికొస్తే మడతపెట్టేస్తాడు
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్' ఒకటి. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.
Family Star | ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఒకటి. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచారచిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించిందని చిత్రబృందం ఆనందం వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి చెందిన టీజర్‌ను సోమవారం విడుదల చేశారు.
గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహించిన ‘దేఖోరే దేఖో..’ పాటతో హీరో పాత్రచిత్రణను అభివర్ణిస్తూ టీజర్ ఆద్యంతం కలర్ఫుల్గా సాగింది. సర్ నేమ్‌కు సరెండరై, ఫ్యామిలీ అంటే వీక్నెస్ ఉన్న కలియుగ రాముడిగా ఈ టీజర్లో విజయ్ దేవరకొండ కనిపించాడు. కుటుంబ క్షేమం కోసం దైవాన్ని పూజిస్తూ, వారిని కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు ఇందులో హీరో. వాళ్లజోలికి ఎవరైనా వస్తే మడతపెట్టి కొడతాడు. అతను వేస్తే బడ్జెట్ షాక్. ప్లాన్ గీస్తే ప్రాజెక్ట్ షేక్.. అంటూ టీజర్లో హీరో గురించి దాదాపుగా చెప్పేశారు. టీజర్ చివరల్లో మృణాల్ అడుగుతుంది.. ‘కాలేజ్‌కి వెళ్లాలి.. కొంచెం దింపుతావా?’ అని. ‘లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ అంటాడు హీరో. కంప్లీట్ ఫ్యామిలీమేన్‌గా ఇందులో విజయ్ దేవరకొండ కనిపిస్తాడనటానికి ఈ టీజర్ ఓ ఉదాహరణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

