Vijay Deverakonda | విజయ్ సినిమా టైటిల్ అదేనా?
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా టైటిల్ ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా టైటిల్ ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొద్దిరోజుల క్రితం తన సోషల్‌మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారమేనని, టైటిల్ గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

