Vijay Devarakonda | ‘కరుప్పు’ ఘన విజయంపై విజయ్ దేవరకొండ ప్రశంసలు.. ధన్యవాదాలు తెలిపిన త్రిష!
Veerabhadrudu | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, నటి త్రిష కథానాయికగా, ప్రముఖ దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
Karuppu Movie | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, నటి త్రిష కథానాయికగా, ప్రముఖ దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తమిళంలో ‘కరుప్పు’ (Karuppu) గా, తెలుగులో ‘వీరభద్రుడు’ (Veerabhadrudu) గా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రంపై, హీరో సూర్య నటనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు.
సినిమా విజయంపై విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… “సూర్య అన్న నటించిన ‘కరుప్పు’ (తమిళం), ‘వీరభద్రుడు’ (తెలుగు) చిత్రాలకు ప్రేక్షకుల నుండి వస్తున్న అపారమైన ప్రేమాభిమానాలను చూడటం చాలా సంతోషంగా ఉంది. థియేటర్లలో ఈ సినిమా సాధిస్తున్న విజయం చాలా పెద్దదని వింటున్నాను. ప్రతి సంవత్సరం వెండితెరపై తన అద్భుతమైన నటనతో, సినిమా కోసం సర్వస్వం ధారపోసే సూర్య అన్నకు ఈ విజయం దక్కడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల కేరింతలు, సందడి చూస్తుంటే మా అందరి హృదయాలు సంతోషంతో నిండిపోతున్నాయి అని విజయ్ పేర్కొన్నారు. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు సూర్య అన్నకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సక్సెస్ తర్వాత మీరు హ్యాపీగా ఒక మంచి హాలిడే ట్రిప్‌కు వెళ్లండి. అలాగే దర్శకుడు ఆర్జే బాలాజీకి, నా ప్రియమైన త్రిషకు నా అభినందనలు” అంటూ విజయ్ దేవరకొండ చిత్ర బృందాన్ని కొనియాడారు.
విజయ్‌కు థాంక్స్ చెప్పిన త్రిష!
సూర్య సినిమా విజయాన్ని అభినందిస్తూ విజయ్ దేవరకొండ చేసిన ఈ పోస్ట్‌పై చిత్ర కథానాయిక త్రిష వెంటనే స్పందించారు. విజయ్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. “థాంక్యూ సో మచ్ విజయ్ దేవరకొండ” అంటూ తన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన ఈ పోస్ట్, దానికి త్రిష ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Thank you so much @TheDeverakonda ♥️
— Trish (@trishtrashers) May 16, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- MakkalSelvan
- RJBalaji
- suriya
- Trisha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

