Family Star | విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో విజయ్ దేవరకొండ లుంగీ కట్టుకొని భుజాల మీద గన్నీ బ్యాగ్‌తో పరుగెత్తుతూ కనిపిస్తున్నారు. ఫ్యామిలీ, మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, సంగీతం: గోపీసుందర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: వాసు వర్మ, రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల.