Home
Cinema
Vijay Deverakonda And Rashmikas Ranabaali Overseas Release Update Telugu Version On October 16 Dubbed Versions Later
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Vijay Deverakonda | టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'రణబాలి' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Vijay Deverakonda | టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రణబాలి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ క్రేజీ కాంబో తెరపైకి వస్తుండటం, అటు ‘టాక్సీవాలా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ – విజయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనుకున్న తేదీ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.
అయితే, ఓవర్సీస్ మార్కెట్లోని ప్రేక్షకులకు, ముఖ్యంగా నాన్-తెలుగు విజయ్ ఫ్యాన్స్‌కు మేకర్స్ నుంచి నిరాశ కలిగించే అప్డేట్ అందింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 16న విడుదల రోజున విదేశాల్లో కేవలం ఒరిజినల్ తెలుగు వెర్షన్ మాత్రమే ప్రదర్శించబడుతుంది. ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన కంటెంట్ సిద్ధం చేయడంలో ఏర్పడిన ఆలస్యం కారణంగా, వాటి రిలీజ్‌ను అక్టోబర్ 23కి వాయిదా వేశారు.
మరోవైపు, ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ థియేటర్ చైన్లలో ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం కాగా, కేవలం ప్రీ-సేల్స్ ద్వారానే సినిమా 50 వేల డాలర్ల మార్కును దాటడం విశేషం. రాబోయే రోజుల్లో ప్రీమియర్ కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అద్భుతమైన బాణీలు అందిస్తున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

