VD12 | విజయ్-గౌతమ్ తిన్ననూరి మూవీ షూటింగ్ ప్రారంభం.. ఆసక్తికరంగా పోస్టర్
Vijay Devarakonda | రౌడీ స్టార్ విజయ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుతున్నాడు. లైగర్ ఫలితం ఎలా ఉన్నా విజయ్ మాత్రం వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ మూడు సినిమాలను చేస్తున్నాడు.
Vijay Devarakonda | రౌడీ స్టార్ విజయ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుతున్నాడు. లైగర్ ఫలితం ఎలా ఉన్నా విజయ్ మాత్రం వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ మూడు సినిమాలను చేస్తున్నాడు. అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ఐదు నెలల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై తిరుగులేని హైప్ తెచ్చిపెట్టింది. పోలీస్ డ్రెస్‌లో మొహానికి ముసుగు ధరించిన పోస్టర్ అప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. అంతేకాకుండా నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు అంటూ పోస్టర్‌పై ఓ క్యాప్షన్‌ను ఇచ్చి ప్రేక్షకుల్లో తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
ఇక గత నెలలో గ్రాండ్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిపారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ గన్ పట్టుకుని కాల్చుతున్న పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్డూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం విజయ్, పరుశురామ్ సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
A spectacular journey of #VD12 commences Today! 🔥#VD12ShootBegins 💥 @TheDeverakonda @anirudhofficial @sreeleela14 @gowtam19 @vamsi84 #SaiSoujanya @NavinNooli #GirishGangadharan @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/CpJXo1Zo2h
— Sithara Entertainments (@SitharaEnts) June 16, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

