Vijay Devarakonda | త్వరలో సెట్స్‌పైకి విజయ్-గౌతమ్ తిన్ననూరి సినిమా?
‘లైగర్’ ఫలితం విజయ్ దేవరకొండను తీవ్రంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న విజయ్ కల.. కల గానే మిగిలిపోయింది.
Vijay Devarakonda Next Movie | ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకుని విజయ్ దేవరకొండ ‘లైగర్’తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి థియేటర్ రెంట్‌కు సరిపడా డబ్బులు కూడా రాలేవు. ఇక రిలీజైన వారంలోపే చాలా వరకు థియేటర్లలో సినిమాను తీసేసారు. ఈ సినిమా ఫలితం విజయ్ను తీవ్రంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న విజయ్ కల.. కల గానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు.
సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కాగా తాజాగా సమంత వయోసైటిస్ అనే వ్యాధితో భాదపడుతున్నట్లు ఇన్‌స్టాలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక దాంతో సమంత షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఖుషీ షూటింగ్ కూడా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యాడు.
విజయ్ తన నెక్స్ట్ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నాడట. కాగా విజయ్ ఈ చిత్రాన్ని త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయట. ఇక ఈ చిత్ర కథ ముందుగా రామ్‌చరణ్ దగ్గరకు వెళ్లింది. చరణ్ కూడా కథ నచ్చడంతో గౌతమ్‌తో సినిమా చేస్తున్నట్లు అఫిషియల్‌గా ప్రకటించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఆదే కథతో విజయ్ సినిమా చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

