Kalki 2898 AD | ‘కల్కి’.. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ.. రౌడీ ఫ్యాన్స్‌కు పూనకాలే
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కల్కి’ (Kalki 2898 AD) ఈ సినిమాకు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కల్కి’ (Kalki 2898 AD) ఈ సినిమాకు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు దుల్కర్ సల్మాన్ ఉన్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విజయ్ ఉన్నాడు అన్నప్పటి నుంచి రౌడీ ఫ్యాన్స్ విజయ్ ఏ పాత్రలో నటించబోతున్నాడు అని వెయ్యి కండ్లతో ఎదురుచూశారు. అయితే నేడు కల్కి ప్రేక్షకుల ముందుకు రాగా.. విజయ్ ఏ పాత్రలో నటించాడో తెలిసిపోయింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించాడు. సినిమాలో విజయ్‌కు సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అశ్వత్థామపై(అమితాబ్) యుద్ధం చేస్తున్న సమయంలో సంభాషణ చెబుతూ విజయ్ కనిపించగా.. ఇది చూసిన సినీ ప్రియులు విజయ్ లుక్, డైలాగ్ డెలివరీ అదిరిపోయిందని తెగ ప్రశంసిస్తున్నారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ ప్రభాస్‌ను చిన్నప్పుడు కాపాడి పెంచిన ఓ యోధుడి పాత్రలో కనిపించాడు. ఇంకా టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్‌వర్మ కూడా అతిథి పాత్రల్లో మెరిశారు.
ఇవి కూడా చదవండి..
-
Kalki 2898 AD | బొమ్మ బ్లాక్ బస్టర్.. ప్రభాస్ ‘కల్కి’ ట్విట్టర్ రివ్యూ
-
Delhi | ఢిల్లీలో భారీ వర్షం.. మండుటెండల నుంచి ఉపశమనం
-
South Africa | తొలిసారి ఫైనల్‌కు సఫారీలు.. ఆఫ్ఘాన్లను ఆటాడుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

