బిచ్చగాడు స్థాయి విజయాన్ని లవ్ గురు సాధిస్తుంది
‘లవ్ గురు’ కథ విన్నాక ఇది నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు వినాయక్‌కు చెప్పాను. మృణాళిని మంచి నటి. ఈ సినిమాలో తన నటన మీ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పగలను.
‘లవ్ గురు’ కథ విన్నాక ఇది నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు వినాయక్‌కు చెప్పాను. మృణాళిని మంచి నటి. ఈ సినిమాలో తన నటన మీ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పగలను. ఇక భరత్ మ్యూజిక్ సూపర్.’ అన్నారు విజయ్ ఆంటోనీ. ఆయన కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘లవ్ గురు’. మృణాళిని రవి కథానాయిక. వినాయక్ వైద్యనాథన్ దర్శకుడు.
రంజాన్ పర్వదిన సందర్భంగా ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రీరిలీజ్ వేడుకలో విజయ్ ఆంటోనీ మాట్లాడారు. ‘ఇందులో నా పాత్ర పేరు లీల. నా కెరీర్లో లభించిన గొప్ప పాత్ర ఇది. హీరోతో సమానమైన ప్రాధాన్యత నా పాత్రకు ఉంటుంది. న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం నన్ను యాక్టింగ్ క్లాసులకు పంపారు విజయ్ ఆంటోని.
ఈ సినిమా చూశాక మీ లైఫ్ పార్ట్‌నర్స్‌తో మీరు మరోసారి ప్రేమలో పడతారు’ అని మృణాళిని రవి చెప్పారు. అనుకోకుండా విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన ఊహించని ఫోన్ కాల్ తన కెరీర్‌ని మార్చేసిందని, ప్రేమ ద్వారా యూనివర్స్‌లో ఏదైనా సాధ్యమే అనే అంశాన్ని ఈ కథలో చెబుతున్నామని, నేటి జనరేషన్ ఆడియన్స్‌కి ఈ సినిమా అంకితం ఇస్తున్నానని దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ తెలిపారు. ఇంకా మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు: నవీన్ యర్నేని, రవిశంకర్, రచయిత భాష్యశ్రీ, సంగీత దర్శకుడు భరత్ ధనశేఖర్, ఇంకా మైత్రీ పంపిణీదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

