ద్వేషించినా సరే ప్రేమించాలి!
ప్రేమను విభిన్న కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ఈ సినిమా చూశాక జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో నేర్చుకుంటారు. ఓ జంట పెళ్లి చేసుకుంటారు.
‘ప్రేమ అనేది లావాదేవీ కాదు..ఇచ్చిపుచ్చుకోవడానికి. మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే నిజమైన ప్రేమ. ఇదే అంశాన్ని భావోద్వేగభరితంగా ‘లవ్‌గురు’ చిత్రంలో ఆవిష్కరించాం’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన కథానాయకుడిగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని పంచుకున్న సినిమా విశేషాలు..
ప్రేమను విభిన్న కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ఈ సినిమా చూశాక జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో నేర్చుకుంటారు. ఓ జంట పెళ్లి చేసుకుంటారు. కొద్ది రోజుల తర్వాత భార్యకు భర్తపై ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తుంది. అయినా తనను అర్థం చేసుకుంటుందని భర్త ఆశిస్తాడు. కానీ ఆమె అతన్ని ఎప్పటికీ ప్రేమించదు. ఈ పరిస్థితుల్లో హీరో ఏం చేశాడు? వారి బంధం ఏ తీరానికి చేరిందన్నదే సినిమాలో ఆసక్తికరమైన అంశం.
ప్రేమ భావన ఎప్పుడైనా మంచే చేస్తుంది. అందుకే నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తులతో కూడా మనం పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి. మనల్ని మోసం చేసిన వారు ఏదో ఒకరోజు తప్పు తెలుసుకుంటారు. ఈ కథలోని హీరో పాత్ర కూడా ద్వేషించిన వారిని ప్రేమిస్తుంటుంది. దర్శకుడు తన నిజ జీవితంలో చూసిన అనుభవాలతో ఈ కథ రాసుకున్నాడు. సంభాషణలన్నీ సహజంగా ఉంటాయి.
నేను తెలుగు నేర్చుకోలేకపోయాను. ఒకవేళ తెలుగు వచ్చి ఉంటే హైదరాబాద్‌లో సెటిలైపోయి ఇక్కడే స్ట్రెయిట్ సినిమాలు చేసేవాడిని. ఇక నా తదుపరి సినిమాల గురించి చెప్పాలంటే..2026వ వేసవిలో ‘బిచ్చగాడు-3’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. ఈ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తా. ప్రస్తుతం మా ప్రొడక్షన్లో మూడు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

