Leo Movie Update | టాక్‌తో సంబంధంలేకుండా విజయ్ సినిమాలు కోట్లు కొల్లగొడుతాయని ఆ మధ్య దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి. ఇదేం సినిమారా బాబు అనుకున్న ‘బీస్ట్’ రెండోందలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఇక సీరియల్ అంటూ ముద్ర పడిన ‘వారసుడు’ సైతం ముడొందల కోట్లు కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. ఇలా ప్రతీ సినిమాకు విజయ్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఇక ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. లియో సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనే విషయం గతంలోనే చిత్రయూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాలో విజయ్, సంజయ్ దత్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారట. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్.. తండ్రికి దూరంగా కాశ్మీర్లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టుకుని ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తుంటాడట. అదే టైమ్‌లో లియో జాడను కొనుకున్న విలన్స్.. విజయ్ను అంతమొందించడానికి అక్కడిదాకా వస్తారట. అయితే మాఫియా సామ్రాజ్యంలో కింగ్‌గా ఎదిగి, దేశం మొత్తం వణికిపోయే నాన్న సంజయ్ దత్‌ను వదిలేసి విజయ్ అక్కడికి ఎందుకు వచ్చాడనేది మేయిన్ సినిమా ప్లాట్ అట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతెందుకు తేరి సినిమా కూడా ఈ కథకు దగ్గరగానే ఉంది. అయితే లోకేష్ టేకింగ్, కట్టిపడేసే స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను మాయ చేస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. కమల్‌ను లోకేష్ విక్రమ్‌లో ఏ స్థాయిలో చూపించాడో.. లియోలో అంతకు మించి చూపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాకు దాదాపు మూడొందల కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.