Vidya Balan | ఫేక్ అకౌంట్, నకిలీ ఫోన్ నంబర్.. ఏకంగా రెండు ఇబ్బందుల బారినపడ్డారు ప్రముఖ నటి విద్యాబాలన్. వరుసగా రెండుసార్లు ఇన్‌స్టా ద్వారా, తన పేరుతో చలామణి అవుతున్న నకిలీ ఫోన్ నంబర్ గురించి జనానికి వెల్లడించారు. ఆ నంబర్‌తో ఓ వ్యక్తి తన పేరుతో అందరికీ ఫోన్లు చేస్తున్నాడని, వాట్సాప్ డీపీలో కూడా తన ఫొటోనే ఉంచుకుని తప్పుదోవ పట్టిస్తున్నాడని వాపోయారు. మరొకరైతే.. తన పేరును సూచించేలా ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ తెరిచారని ఆందోళనగా చెప్పారు విద్యాబాలన్.
తన లాయర్లు ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని, ఆ ఫోన్ లేదా అకౌంట్ నుంచి సందేశాలు అందితే పట్టించుకోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు సెలెబ్రిటీల అకౌంట్లను పోలిన ఖాతాలు తెరిచి… డబ్బు కోసం, ఇతరత్రా సాయాల కోసం వెంటపడటం సర్వసాధారణం అయిపోయింది. తస్మాత్ జాగ్రత్త!