నా కల చెదిరిపోయింది!
కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దిగ్గజ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితకథతో రూపొందిస్తున్న ‘భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి’ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే.
- ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌పై విద్యాబాలన్
కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దిగ్గజ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితకథతో రూపొందిస్తున్న ‘భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి’ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. రష్మిక మందన్న టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పదేళ్ల క్రితమే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కాల్సి ఉంది.
విద్యాబాలన్ ప్రధాన పాత్రలో రాజీవ్ మీనన్ దర్శకత్వంలో ఈ బయోపిక్ కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ విషయం గురించి విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించాలనే తన కల నెరవేరకపోవడం బాధగా ఉందని ఆమె పేర్కొన్నది.
‘చిన్నతనంలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాడిన సుప్రభాతంతోనే ఇంట్లో రోజు మొదలయ్యేది. ఆమె జీవితం గురించి నాకు చాలా విషయాలు తెలుసు. రాజీవ్ మీనన్ అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. కానీ అనుకోకుండా సినిమా ఆగిపోయింది’ అని విద్యాబాలన్ చెప్పింది. అయితే రెండేళ్ల క్రితం ఎం.ఎస్.సుబ్బులక్ష్మికి నివాళిగా ఆమె జయంతి రోజున ప్రత్యేకమైన ఫొటోషూట్‌తో ముందుకొచ్చింది విద్యాబాలన్. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ అంటూ ఆమె ఫొటోషూట్‌పై ప్రశంసలు లభించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

