విద్యాబాలన్ పేరిట ఫేక్ అకౌంట్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే నటీనటుల్లో విద్యాబాలన్ ఒకరు. తన సినిమా అప్డేట్స్తోపాటు ఫొటోషూట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారామె. చిట్‌చాట్ చేస్తూ అభిమానుల ప్రశ్నలకు సరదా సమాధానాలిస్తుంటారు. తాజాగా కొందరు ఆకతాయిలు ఆమె పేరుతో ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే నటీనటుల్లో విద్యాబాలన్ ఒకరు. తన సినిమా అప్డేట్స్తోపాటు ఫొటోషూట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారామె. చిట్‌చాట్ చేస్తూ అభిమానుల ప్రశ్నలకు సరదా సమాధానాలిస్తుంటారు. తాజాగా కొందరు ఆకతాయిలు ఆమె పేరుతో ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేశారు. ఈ ఫేక్ అకౌంట్‌పై విద్యాబాలన్ స్పందించారు. ‘తొలుత ఒక ఫోన్ నంబర్ నా పేరుతో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇప్పుడు ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ సృష్టించారు. నా స్నేహితులకు, కుటుంబసభ్యులకు, అభిమానులకు నా పేరుతో మెసేజ్‌లు పంపుతున్నారు.
ఇలాంటి వారిని ప్రోత్సహించొద్దు. నేను, నా టీమ్ ఆ అకౌంట్‌పై రిపోర్ట్ చేశాం. మీరందరు కూడా దీన్ని బ్లాక్ చేయండి. మెసేజ్‌లు వస్తే నమ్మకండి’ అని విద్యాబాలన్ రాసుకొచ్చారు. బెంగాలీ చిత్రాలతో నటిగా ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్ బాలీవుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘గురు’, ‘ఏకలవ్య’, ‘పా’, ‘ఇష్కియా’, ‘డర్టీ పిక్చర్’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్, కియారా అద్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ‘భూల్ భులైయా 3’లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో దీని షూటింగ్ ప్రారంభం కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

