Video | పఠాన్ సినిమా నచ్చలేదన్న చిన్నారి.. స్పందించిన షారూఖ్ ఖాన్
Pathaan Movie | పఠాన్ సినిమాతో మళ్లీ బిగ్ స్క్రీన్‌పై మెరిసిన షారూఖ్ ఖాన్.. తన అభిమానుల కలలను నిజం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తు్న్నది.
ముంబై: పఠాన్ సినిమాతో మళ్లీ బిగ్ స్క్రీన్‌పై మెరిసిన షారూఖ్ ఖాన్.. తన అభిమానుల కలలను నిజం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తు్న్నది. విడుదలైన తర్వాత తొలి 10 రోజుల్లో దాదాపు రూ.400 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారూఖ్ నటనను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కానీ, ఒక చిన్నారికి మాత్రం పఠాన్ మూవీ నచ్చలేదు. తనకు పఠాన్ సినిమా నచ్చలేదని చిన్నారి చెప్పిన వీడియో ప్రస్తుతం ట్విటర్లో హల్చల్ చేస్తున్నది. అభిషేక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో ఏముందంటే.. ‘అహనా, నువ్వు ఏ సినిమా చూసి వచ్చావ్’ అని అభిషేక్ అహనా అనే చిన్నారిని ప్రశ్నించాడు. అందుకు అహనా ‘పఠాన్’ అని చెప్పింది. ఆ సినిమా నీకు నచ్చిందా అని అడగ్గానే ‘లేదు’ అని జవాబిచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చివరికి హీరో షారూఖ్ ఖాన్ దృష్టికి వచ్చింది. దానికి ఆయన తనదైన స్టైల్లో.. ‘ఓహ్ ఓహ్..!! ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేయాలి. చిన్నారి ప్రేక్షకులను అస్సలు నిరాశపర్చొద్దు.’ అంటూ రిప్లై ఇచ్చాడు. కేవలం ఏడు సెకన్ల నిడివిగల అహనా వీడియోపై మనం కూడా ఓ లుక్కేద్దామా..
@iamsrk Ooops pic.twitter.com/uePgawGkUg
— Abhishek kumar (@AbhiKmr88) February 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

