Aadarsha Kutumbam | దసరా బరిలో వెంకీమామ.. ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు!
AK47OnOCT2nd | Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' (AK47) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (AK47) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. వెంకటేష్ కెరీర్లో 77వ చిత్రంగా (#Venky77) తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను గాంధీ జయంతి సందర్భంగా, అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు “ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ.. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం తలుపులు తెరుచుకోబోతున్నాయి” అంటూ మేకర్స్ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రఖ్యాత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మొదటి పూర్తి స్థాయి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

