The Great Indian Family | బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’(Uri), మసాన్ (Masaan), సర్దార్ ఉద్దమ్ (Sardar Uddam) వంటి చిత్రాలలో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విక్కీ. ఇక విక్కీ నటించిన ఉరి సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా విక్కీ నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. గతేడాది ఈయన ప్రాధాన పాత్రలో నటించిన ‘సర్దార్ ఉద్దం’ నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ రీసెంట్గా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ (The Great Indian Family ). మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ (Maanushi Chillar) ఈ సినిమాలో కథానాయికగా నటించింది. సెప్టెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా
నిలిచింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక యష్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Flims) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా (Aditya Chopra) ఈ చిత్రాన్ని నిర్మించగా.. ధూమ్ త్రీ (Dhoom 3), థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ (Thugs Of Hindustan) చిత్రాల ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య (Vijay krishna Acharya) దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీలో యశ్పాల్ శర్మ, వేదాంత సిన్హా, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, సదియా సిద్ధిఖీ, అల్కా అమీన్, సృష్టి దీక్షిత్, భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వచ్చిన 50వ చిత్రం కావడం విశేషం.
an unfiltered dose of laughter, love and heartwarming chaos!#TheGreatIndianFamilyOnPrime, watch nowhttps://t.co/VNE173MCCt@vickykaushal09 @ManushiChhillar #VijayKrishnaAcharya #ManojPahwa #KumudMishra #SadiyaSiddiqui #AlkaAmin @srishtidixit @bhuvanarora27 @Ashutoshujjwall… pic.twitter.com/BdtS0Lm9fe
— prime video IN (@PrimeVideoIN) November 16, 2023