సూపర్‌స్టార్ కృష్ణకు గుండెపోటు
సూపర్ స్టార్, తెలుగు దిగ్గజ నటుడు కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 80 ఏండ్లు
సూపర్ స్టార్, తెలుగు దిగ్గజ నటుడు కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 80 ఏండ్లు. ఆదివారం రాత్రి ఒంటిగంటకు ఆయన ఆస్వస్థతకు గురవడంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్చారు. కోడలు నమ్రత ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. సీపీఆర్ నిర్వహించిన తర్వాత ఐసీయూలో చికిత్స అందించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరో 24 గంటల వరకు ఆయన చికిత్సకు ఎలా స్పందిస్తున్నారనేది చెప్పలేమన్నారు. డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ..‘రాత్రి ఒంటి గంట సమయంలో కృష్ణ గారిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించి 20 నిమిషాల పాటు సీపీఆర్ నిర్వహించాం. అనంతరం ఐసీయూకి తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించాం. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నాం. పరిస్థితి విషమంగానే ఉంది. కార్డియాలజీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నది. కృష్ణ గారి ఆరోగ్యం కోసం ప్రార్థించండి’ అన్నారు. ఇటీవల కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు, సతీమణి ఇందిరాదేవి కన్నుమూశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

