Sathyaraj | నరేంద్ర మోదీ బయోపిక్‌లో కట్టప్ప సత్యరాజ్
Sathyaraj | తమిళ సీనియర్ నటుడు బాహుబలి ఫేమ్ కట్టప్ప సత్యరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా ఇండియా వైడ్ తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. తాజాగా ఈ నటుడు పొలిటికల్ బయోపిక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
Sathyaraj | తమిళ సీనియర్ నటుడు బాహుబలి ఫేమ్ కట్టప్ప సత్యరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా ఇండియా వైడ్ తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. తాజాగా ఈ నటుడు పొలిటికల్ బయోపిక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై ఓ బయోపిక్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బయోపిక్‌లో సత్యరాజ్ నటించనున్నట్లు సమాచారం అందింది. మోదీ పాత్రలో ఆయన నటిస్తారని సమాచారం. దీనికి సంబంధించి కోలీవుడ్ మీడియాలో చర్చలు జరుగుతుండగా.. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తారని సినీ వర్గాలు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం అన్ని భారతీయ భాషల్లో తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక మోదీ బయెపిక్‌లో సత్యరాజ్ నటిస్తే.. అతడికి ఇది రెండో బయెపిక్ అవుతుంది. ఇంతకుముందు సత్యరాజ్ భారతీయ సామాజిక కార్యకర్త , ‘ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ బయెపిక్‌లో నటించాడు. ఈ చిత్రంలో సత్యరాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

