చోళుల కాలంలో హిందూ పదం లేదు!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’ లో చోళ చక్రవర్తి రాజరాజ చోళ మతం గురించి తమిళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌హాసన్ మద్దతుగా నిలిచారు.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’ లో చోళ చక్రవర్తి రాజరాజ చోళ మతం గురించి తమిళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌హాసన్ మద్దతుగా నిలిచారు. రాజరాజ చోళుడు హిందూ చక్రవర్తి కాడని, ఆయన పరిపాలనా కాలంలో హిందూ అనే పదమే లేదని కమల్‌హాసన్ తెలిపారు. ‘రాజరాజ చోళుడి కాలంలో హిందూ అనే పదం ఇంకా ఉనికిలోకి రాలేదు. కేవలం శైవం, వైష్ణవం, జైనిజమ్ మాత్రమే ఉండేవి. హిందూ అనే పేరును బ్రిటీష్ వాళ్లు తీసుకొచ్చారు’ అని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. అదే సమయంలో సినిమా కమర్షియల్ సక్సెస్‌పై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ‘విక్రమ్’ వసూళ్లను ‘పొన్నియన్ సెల్వన్’ అధిగమిస్తే సంతోషిస్తానన్నారు. కొద్దిరోజుల క్రితం దర్శకుడు వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి.
మన మూలాల్ని మన నుంచి దూరం చేస్తూ, మతం పేరుతో సంస్కృతిని కాషాయికరణ చేసే ప్రయత్నం మంచిది కాదని, రాజరాజ చోళన్‌ను హిందూ అంటూ పదేపదే ప్రస్తావిస్తూ చరిత్రను వక్రీకరించొద్దని వెట్రిమారన్ వ్యాఖ్యానించారు. సినిమా సామాన్యుడిని ప్రభావితం చేసే మాధ్యమమని, దాని తాలూకు రాజకీయ కోణాల్ని అర్థం చేసుకొని సాంస్కృతిక ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తాజాగా ఆయనకు కమల్‌హాసన్ మద్దతుగా రావడంతో ఈ వివాదం మరింతగా రాజుకుంటుందని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. కాగా పాన్ ఇండియా సినిమాగా ఇటీవల తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ఇతర భాషల్లో అంతగా ఆదరణ లభించలేదు. కేవలం తమిళంలో మాత్రమే ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. తమిళంలో 100 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
సోషల్ మీడియాలో వార్
వెట్రిమారన్ వ్యాఖ్యలపై తమిళ సోషల్‌మీడియాలో వార్ నడుస్తున్నది. తమిళులు హిందువులు కాదంటూ ఓ వర్గం, వెయ్యేళ్లుగా తమిళులు శివుడిని పూజిస్తు న్నారంటూ మరో వర్గం ట్వీట్ వార్ చేస్తున్నారు. ‘తమిళ్స్ ఆర్ నాట్ హిందూస్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

