ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. ‘హిట్’ సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శైలేష్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రేపు ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ కొలను స్పందిస్తూ…‘నా విజన్‌ను నమ్మినందుకు వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. మీరు గర్వపడే సినిమా రూపొందిస్తానని నమ్ముతున్నాను. ఇలాంటి మంచి చిత్రబృందంతో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.