శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమకోసం, శివరామరాజు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వెంకట్.. కాస్త విరామం తర్వాత మళ్లీ నటిస్తున్న చిత్రం ‘హరుడు’. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. రాజ్ తాళ్లూరి దర్శకుడు. మే 8న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. వెంకట్ మాట్లాడుతూ ‘దర్శకుడు రాజ్ తాళ్లూరి అద్భుతంగా సినిమా తీశాడు.
ఈ కథలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది. సాంకేతికంగా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుంది. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. వెంకట్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని, మంచి సినిమాను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని దర్శకుడు రాజ్ తాళ్లూరి నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా అతిథిగా విచ్చేసిన చంద్రమహేశ్తో పాటు ప్రవీణ్, సంగీత దర్శకుడు మణి జిన్న, డీఓపీ ఆనంద్, నటీనటులు అలీ, లత, వేద్విక కూడా మాట్లాడారు.