న్యూఢిల్లీ : బాలీవుడ్ మూవీ టైగర్ 3 ప్రదర్శిస్తున్న గ్రేటర్ నోయిడాలోని వెనిస్ మాల్లో (Mall sealed) సినిమా హాల్‌కు బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు సీల్ వేశారు. సినిమా హాల్‌కు అధికారులు సీల్ వేయడంతో మూవీని అర్ధంతరంగా నిలిపివేశారు.
పలుమార్లు నోటీసులు జారీ చేసినా మాల్ యజమానులు గ్రాండ్ వెనిజియ కమర్షియల్ టవర్ ప్రైవేట్ లిమిటెడ్, భాసిన్ ఇన్ఫోటెక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ బకాయిలను చెల్లించకపోవడంతో గ్రేటర్ నోయిడా అధికారులు సినిమా హాల్‌కు సీల్ వేశారు.
బకాయిల వసూళ్లకు జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలో జరుగుతున్న క్యాంపెయిన్‌లో భాగంగా పన్ను ఎగవేతదారులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Read More :