అమ్మాయి భయపడితే?
‘డైరెక్టర్ హరిత అందరికీ నచ్చేలా ఈ సినిమాను తీశారు. డైరెక్టర్‌గా ఇది ఆమె తొలి సినిమా అంటే ఎవరూ నమ్మరు. ఈ సినిమాలో చేసిన రోల్ నటిగా నాకు సంతృప్తినిచ్చింది.
‘డైరెక్టర్ హరిత అందరికీ నచ్చేలా ఈ సినిమాను తీశారు. డైరెక్టర్‌గా ఇది ఆమె తొలి సినిమా అంటే ఎవరూ నమ్మరు. ఈ సినిమాలో చేసిన రోల్ నటిగా నాకు సంతృప్తినిచ్చింది. అనూప్‌రూబెన్స్ బీజీఎం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఈ సినిమాకు విడుదలకు ముందే 64 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులొచ్చాయి. ప్రేక్షకులకు కూడా తప్పక నచ్చుతుంది’ అని హీరోయిన్ వేదిక నమ్మకం వ్యక్తం చేశారు.
ఆమె లీడ్ రోల్ చేసిన చిత్రం ‘ఫియర్’. అరవింద్ కృష్ణ ప్రత్యేకపాత్ర పోషించారు. హరిత గోగినేని దర్శకత్వంలో ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో వేదిక మాట్లాడారు. ‘ఈ సినిమాలోని కథానాయిక పాత్రకు నేను కోరుకున్న అన్ని అర్హతలు ఉన్న నటి వేదిక. అందుకే ఆమెను తీసుకున్నా.
అనూప్ తన మ్యూజిక్ ద్వారా నటిగా వేదికను, డైరెక్టర్‌గా నన్నూ డామినేట్ చేశారు. అది రేపు తెరపై చూస్తారు. జీవితంలో కొన్ని అనుకోని సందర్భాల్లో ఒక అమ్మాయి భయపడితే పర్యావసానాలు ఎలా ఉంటా యి అనేదే ‘ఫియర్’ కథ. వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం’ అని డైరెక్టర్ హరిత గోగినేని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

