వరుణ్‌తేజ్ కథానాయకుడిగా ఆయన సోదరి నిహారిక నిర్మిస్తున్న తాజా చిత్రం ‘బరి’ శనివారం ప్రారంభమైంది. యదువంశీ దర్శకుడు. ఈ సినిమా ఓపెనింగ్‌కు అగ్ర నటుడు పవన్‌కల్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి తొలి సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. మైత్రీ మూవీస్ నవీన్ యెర్నేని కెమెరా స్విఛాన్ చేశారు. వాలీబాల్ నేపథ్యంలో సాగే చిత్రమిదని, తాను ఇప్పటికే ప్రాక్టీస్‌లో ఉన్నానని, సోదరి నిర్మిస్తున్న ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని వరుణ్‌తేజ్ అన్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే స్పోర్ట్స్ డ్రామా ఇదని నిహారిక కొణిదెల పేర్కొన్నది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ధనుష్ భాస్కర్, సంగీతం: అనుదీప్‌దేవ్, నిర్మాణ సంస్థ: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిర్మాత: నిహారిక కొణిదెల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యదువంశీ.