Varun Tej Son | వరుణ్ తేజ్-లావణ్య కొడుకు వాయువ్ ఫేస్ రివీల్.. ఫస్ట్ బర్త్‌డేకే మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్!
Varun Tej Son | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లుగా ఎంతో గోప్యంగా ఉంచిన తమ కుమారుడు వాయువ్ ముఖాన్ని తొలిసారి అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు. వాయువ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ క్యూట్ సర్ప్రైజ్ ఇవ్వడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Varun Tej Son | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లుగా ఎంతో గోప్యంగా ఉంచిన తమ కుమారుడు వాయువ్ ముఖాన్ని తొలిసారి అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు. వాయువ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ క్యూట్ సర్ప్రైజ్ ఇవ్వడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ సోషల్ మీడియా ఖాతాల్లో వాయువ్‌కు సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను పంచుకున్నారు. తండ్రి ఒడిలో హాయిగా ఉన్న చిన్నారి.. తల్లితో కలిసి నవ్వుతున్న క్షణాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మెగా అభిమానులు చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కొడుకు మొదటి పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తేజ్ ఎంతో భావోద్వేగంతో ప్రత్యేక సందేశాన్ని రాశారు. వాయువ్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రపంచమే మరింత అందంగా మారిందని తెలిపారు. తండ్రిగా మారడం తన జీవితంలోనే అత్యంత గొప్ప అనుభూతి అని చెప్పిన వరుణ్ తేజ్.. వాయువ్‌ను మొదటిసారి కళ్లతో చూసే ముందే అతడిపై ప్రేమ పెంచుకున్నానంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు. కొడుకుకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికీ తన ప్రేమ అలాగే ఉంటుందని పేర్కొన్నారు. లావణ్య త్రిపాఠి కూడా తన కుమారుడి కోసం ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. తనను తల్లిగా ఎంచుకున్నందుకు వాయువ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తన జీవితంలోకి వాయువ్ రాకముందు ప్రేమ అంటే తనకు తెలుసని అనుకున్నానని.. కానీ అతడు పుట్టిన తర్వాత ప్రేమకు మరో కొత్త అర్థం తెలిసిందని లావణ్య పేర్కొన్నారు. తనకు బయట జీవిస్తున్న మరో హృదయం వాయువ్ అంటూ కొడుకుపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. చిన్నారి నవ్వులు, పసి చేతుల స్పర్శలు, కౌగిలింతలు తమ ఇంట్లో ఎనలేని ఆనందాన్ని నింపాయని తెలిపారు. తమ జీవితంలో వాయువ్ చీకటిలో చంద్రుడిలా, వెలుగునిచ్చే సూర్యుడిలా మారాడని లావణ్య భావోద్వేగంగా రాసుకొచ్చారు. వాయువ్ ఫొటోలు బయటకు రావడంతో మెగా కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. నిహారిక కొణిదెల చిన్నారిని ఎంతో ముద్దుగా పొగుడుతూ అతడు తాను చూసిన అత్యంత అందమైన, హ్యాండ్సమ్ బాయ్ అంటూ కామెంట్ చేశారు. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా వాయువ్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా చిన్నారి ఫొటోలపై స్పందిస్తూ విషెస్ చెప్పారు.బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హీరోయిన్లు రీతూ వర్మ, అనుపమ పరమేశ్వరన్, రుహానీ శర్మ తదితరులు కూడా వాయువ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

