Varun Tej | రీసెంట్గా గాంఢీవదారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. VT13 వస్తున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ ప్రాజెక్టుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
కాగా కరుణకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కోసం మేకోవర్ మార్చుకునే పనిలో పడ్డాడు వరుణ్ తేజ్. మట్కా (Matka) టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో తన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ జిమ్‌లో చెమటోడుస్తూ.. సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తోన్న ప్రాజెక్ట్ విశేషం.
కథానుగుణంగా ఇందులో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరాఫతేహి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఆపరేషన్ వాలెంటైన్లో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
యదార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మానుషి ఛిల్లార్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు.
మట్కా టైటిల్ టీజర్..