Operation Valentine | నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న వరుణ్‌తేజ్ కొత్త చిత్రం
Operation Valentine | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ఆపరేషన్ వాలంటైన్. మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, రుహానీ శర్మ నటించిన ఈ సినిమా మార్చి 1వ తేదీన విడుదలైంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదలైన ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గురించి అద్భుతంగా చూపించారు.
Operation Valentine | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ఆపరేషన్ వాలంటైన్. మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, రుహానీ శర్మ నటించిన ఈ సినిమా మార్చి 1వ తేదీన విడుదలైంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదలైన ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గురించి అద్భుతంగా చూపించారు. పుల్వామా ఎటాక్, ఉగ్రవాదులకు ఇండియా ఇచ్చిన కౌంటర్ వంటి పలు యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు రాబట్టడంతో మాత్రం వెనుకబడిపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలోకి రానుంది. అంటే మార్చి 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగు వర్షన్ మాత్రమే ఆ రోజు విడుదలవుతుంది. ఆ తర్వాత తమిళం, కన్నడ మలయాల భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. హిందీ వర్షన్‌ను మరో రెండు నెలల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

