HomeCinemaVarun Tej Korean Kanakaraju Movie First Song Out
నీ నవ్వులు సోకి మబ్బులు మెరుపులయ్యేనే..
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ కామెడీ అడ్వెండర్ ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది.
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ కామెడీ అడ్వెండర్ ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి తొలిపాటను శనివారం మేకర్స్ విడుదల చేశారు.
‘కమ్సాహంనిదా’ అంటూ కొరియన్ భాషలో కథానాయిక పలకడం.. దాని అర్థం ఏంటి? అని కథానాయకుడు అడగడం.. ‘అంటే.. కొరియన్ భాషలో ధన్యవాదాలు అని అర్థం’ అంటూ ఆమె చెప్పడంతో పాట మొదలైంది. ‘నీ నవ్వులు సోకి మబ్బులు మెరుపులయ్యేనే.. నీ కాళ్లే తాకి సంద్రం తీయగయ్యేనే..’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, ఎస్.ఎస్.థమన్ స్వరపరిచారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. యాష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. హీరో ప్రేమలోని అమాయకత్వాన్ని ప్రజెంట్ చేసేలా ఈ పాట సాగింది. మాస్, రగ్డ్ లుక్‌తో వరుణ్‌తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, రితికాతో ఆయన కెమిస్ట్రీ ఆకట్టుకున్నది. కమెడియన్ సత్యా కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌రెడ్డి కాటసాని, ఎడిటింగ్: సత్యాజీ.