దేశ రక్షణలో ప్రధాన భూమిక పోషించే త్రివిధ దళాల్లో ఒకటైన వైమానిక దళం శక్తి సామార్థ్యాలను, విధి నిర్వహణంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను, దేశ రక్షణ విషయంలో రాజీలేని పోరాటాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. వరుణ్‌తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు.
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ సంస్థలు నిర్మించాయి. మార్చి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’కు మంచి స్పందన లభించిందని, ప్రజల్లో దేశభక్తిని ప్రోదికొల్పే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ వైమానిక దళాధికారి పాత్రలో నటిస్తుండగా, కథానాయిక మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది.