తాను హిల్ స్టేషన్ (కూర్గ్) నుంచి వచ్చాను. జీవితంలో ప్రకృతి ఒక భాగం. నిజ జీవితంలో మేము చెట్లు, నదులు, కొండలు, జంతువులను ఆరాధిస్తాం. ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాలో తాను నటించిన పాత్ర నేను రిలేట్ చేసుకునేలా ఉందనే ఓకే చెప్పా’ అని చెప్పుకొచ్చింది వర్ష బొల్లమ్మ. తాను హిల్ స్టేషన్ (కూర్గ్) నుంచి వచ్చాను. జీవితంలో ప్రకృతి ఒక భాగం. నిజ జీవితంలో మేము చెట్లు, నదులు, కొండలు, జంతువులను ఆరాధిస్తాం.
‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాలో తాను నటించిన పాత్ర నేను రిలేట్ చేసుకునేలా ఉందనే ఓకే చెప్పా’ అని చెప్పుకొచ్చింది వర్ష బొల్లమ్మ. హీరో సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. రాజేశ్ దండా నిర్మాత. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్నదీ సినిమా. ఈ సందర్భంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. ‘దర్శకుడు వీఐ ఆనంద్ గారు కథ చెప్పినపుడు అసలు ఇలాంటి కథ ఎలా ఆలోచించగలిగారో అనిపించింది.
ఇందులో భూమి అనే పాత్రలో కనిపిస్తాను. ఆమె ఓ ట్రైబల్ గర్ల్. ఊళ్లో తానొకత్తే చదువుకున్న అమ్మాయి. తప్పును నిలదీసే ధైర్యవంతురాలు. ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. చేయగలనో? లేదో? అని ఆలోచించుకోవడానికి సమయం పట్టింది. నిడివి తక్కువగా ఉన్నా సినిమాలో ప్రాధాన్యమున్న పాత్రలను చేయడానికే ఆసక్తి చూపిస్తాను. ఇప్పటివరకు చేసినవన్నీ అలా వచ్చినవే. దర్శకుడు ఈ కథ రాసుకున్నప్పుడే భూమి పాత్రకు నన్ను అనుకున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది’ అని అన్నారు. ఇంకా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ.. ‘ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నా. దాని గురించి నిర్మాతలు త్వరలో తెలియజేస్తారు. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేశాను. త్వరలో కన్నడలోనూ చేసే అవకాశం ఉంది’ అని తెలిపింది.