వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కొడైకెనాల్లో రెండు వారాల పాటు కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ ‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నా కెరీర్లో ఉత్తమ పాత్రగా మిగిలిపోతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కూతురిని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించే ఓ తల్లి కథే ఈ చిత్రం. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, కూతురు క్షేమం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే ధైర్యవంతురాలైన మహిళగా వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది’ అన్నారు. కొడైకెనాల్లో పద్నాలుగా రోజుల పాటు కీలక ఘట్టాలను తెరకెక్కించామని నిర్మాత మహేంద్రనాథ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నాని, సంగీతం: గోపీసుందర్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ కాట్జ్.