వధువుగా థ్రిల్ చేస్తా..
‘ఇటీవల ‘మాన్షన్ 24’ అనే వెబ్‌సిరీస్ చేశాను. ఆ షూటింగ్‌లోనే నాకు ‘వధువు’ కథ చెప్పారు. సక్సెస్ఫుల్ బెంగాలీ వెబ్‌సిరీస్ ‘ఇందు’ని తెలుగులో వధువుగా తీస్తున్నారు. ఈ ప్రపోజల్ నాదగ్గరకొచ్చినప్పుడు ఎైగ్జెట్ అయ్యాను.
‘ఇటీవల ‘మాన్షన్ 24’ అనే వెబ్‌సిరీస్ చేశాను. ఆ షూటింగ్‌లోనే నాకు ‘వధువు’ కథ చెప్పారు. సక్సెస్ఫుల్ బెంగాలీ వెబ్‌సిరీస్ ‘ఇందు’ని తెలుగులో వధువుగా తీస్తున్నారు. ఈ ప్రపోజల్ నాదగ్గరకొచ్చినప్పుడు ఎైగ్జెట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ నా కెరీర్లో ఇప్పటివరకూ చేయలేదు’ అని అవికాగోర్ అన్నారు. ఆమె టైటిల్‌రోల్ పోషిస్తున్న వెబ్ సిరీస్ ‘వధువు’. నందు, అలీ రెజా కీలక పాత్రధారులు. పోలూరు కృష్ణ దర్శకుడు. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాతలు.
ఈ నెల 8న నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ అనుభవాలను అవికా గోర్ విలేకరులతో పంచుకున్నారు. ‘ఇందులో అందరూ అనుకున్నట్టు హారర్ ఎలిమెంట్స్ ఉండవు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ సన్నివేశాలు ఉంటాయి. ఇప్పటివరకూ టీవీ కంటెంట్‌ని ఇష్టపడేవారు ‘వధువు’తో ఓటీటీకి వస్తారు’ అని అవికా నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కథలో చాలా ప్రశ్నలు ఉంటాయని, అవన్నీ ఆసక్తిని కలిగిస్తాయని, చిన్నారి పెళ్లికూతురు’ టైమ్‌లో చిన్నపిల్లని కావడంవల్ల పెళ్లి అంటే ఏంటో కూడా తెలిసేదికాదు, డైరెక్టర్ని అడిగి తెలుసుకొని చేసేదాన్నని, ఇప్పుడు పూర్తి అవగాహనతో నటిస్తున్నానని, ఇదంతా తన పాత్రల ద్వారా తెలుసుకున్న విజ్ఞానమేనని అవిక అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

