ఎవరెస్ట్ అంత స్నేహం
వయసు పైబడిన నలుగురు మిత్రుల కథ ‘ఊంచాయీ’ చిత్రం. ఈ నలుగురికీ నాలుగు వ్యాపకాలు. ఒకరికి పర్వతారోహణ అంటే ప్రాణం.
ఊంచాయీ
జీ5 (జనవరి 6)
దర్శకత్వం: సూరజ్ బర్జాత్యా
నటవర్గం: అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, డానీ.
వయసు పైబడిన నలుగురు మిత్రుల కథ ‘ఊంచాయీ’ చిత్రం. ఈ నలుగురికీ నాలుగు వ్యాపకాలు. ఒకరికి పర్వతారోహణ అంటే ప్రాణం. రెండో వ్యక్తికి రచనా వ్యాసంగం అభిరుచి. మరో ఇద్దరు చిరువ్యాపారులు. తరచూ కలుసుకుంటూ, ఆనందాలు పంచుకుంటూ శేష జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటారు. నలుగురిలో ఒకరు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తారు. మిత్రుడు పోయిన బాధను భరించలేకపోతారు ముగ్గురూ. చనిపోయిన వ్యక్తికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘనత ఉంటుంది.
జీవితంలో ఒక్కసారైనా తన ముగ్గురు స్నేహితులను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకైనా తీసుకెళ్లాలని అతను కోరుకుంటాడు. అందుకు పాస్‌లు కూడా తీసుకుంటాడు. కానీ, అది జరగకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడు. తమ స్నేహితుడి కోరికను తీర్చాలని ముగ్గురు మిత్రులు భావిస్తారు. అతని అస్థికలను ఎవరెస్ట్ ఒడిలో ఉంచాలని నిర్ణయిస్తారు.
70 ఏండ్లకు చేరువైన ఈ వృద్ధులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు సిద్ధమవుతారు. ఇంతకూ ఈ ముగ్గురూ అక్కడికి చేరుకున్నారా? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి? ఇది మిగతా కథ! మిత్రత్రయం సాగించిన సాహసయాత్రను హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. గతేడాది నవంబర్‌లో థియేటర్లో విడుదలైన ‘ఊంచాయీ’ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇప్పటికీ వందకుపైగా థియేటర్లలో ఆడుతున్నది. అంతలోనే ఓటీటీలో విడుదలై రికార్డు హిట్స్ కొల్లగొడుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

