అదిరే యాక్షన్
తన కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్' మొదటి షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తిచేశారు స్టార్ హీరో పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో శ్రీలీల నాయికగా నటిస్తున్నది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
తన కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మొదటి షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తిచేశారు స్టార్ హీరో పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో శ్రీలీల నాయికగా నటిస్తున్నది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర తొలి షెడ్యూల్లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజిషన్‌లో వెయ్యిమందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా స్టంట్స్ రూపొందించారు. అలాగే భారీ పోలీస్‌స్టేషన్ సెట్లో కొన్ని కీలక సన్నివేశాలు, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, పిల్లలతో మరికొన్ని కామెడీ సీన్స్ చేశారు. శ్రీలీలతో రొమాంటిక్ ఎపిసోడ్స్ పిక్చరైజ్ చేశారు.
ఈ షెడ్యూల్లో తెరకెక్కించిన ఫుటేజ్ పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు చిత్రబృందం తెలిపింది. పవన్ క్యారెక్టర్‌కు స్పెషల్ మేనరిజమ్స్‌తో పాటు ఆకట్టుకునేలా డైలాగ్స్ ఉంటాయని దర్శకుడు హరీశ్ చెబుతున్నారు. మరోవైపు పవన్ మరో కొత్త సినిమా ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) రెగ్యులర్ షూటింగ్ ముంబైలో మొదలైంది. వచ్చే వారం ఈ చిత్ర షూటింగ్లో పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారని నిర్మాణ సంస్థ తెలియజేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

