Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్‌కి ముహూర్తం ఫిక్స్.?
Ustaad Bhagat Singh | టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ (Pawan kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Ustaad Bhagat Singh | టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ (Pawan kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా మైత్రి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
“ఎక్స్పెక్ట్ ది అన్ ఎక్స్పెక్టెడ్” అంటూ మార్చి 19 డేట్‌తో ఓ పోస్ట్ పెట్టింది ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఇక ఈ పోస్టులో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ సెషన్లో పాల్గొన్న ఫొటోలు కనిపించాయి. అంటే మార్చి 19న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అందుకే పవన్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను పోస్ట్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ట్వీట్‌ను “లెట్స్ డూ ఇట్ ఎగైన్” అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ రీట్వీట్ చేశారు. మొత్తానికి ఒక్క అప్డేట్తో ఉస్తాద్ భగత్ సింగ్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతుంది.
Expect the unexpected 😎
19th March ❤️🔥❤️🔥❤️🔥#UstaadBhagatSingh pic.twitter.com/JZfYC5en6y
— Mythri Movie Makers (@MythriOfficial) March 17, 2024
ఇక ఈ మూవీ 2022లోనే మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం కావడంతో వాయిదా పడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

