Pawan Kalyan | భాగ్యనగరిలో ఉస్తాద్
ఓ వైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు పవన్‌కల్యాణ్. ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ కొన్ని రోజులు ఆయన సినిమాలకు బ్రేక్ ఇస్తారని చాలామంది భావించారు. అందరి అంచనాలనూ తల్లకిందులుచేస్తూ ‘ఉస్తాద్ భగత్‌సింగ్' షూటింగ్‌కి రెడీ అయిపోయారు పవన్‌కల్యాణ్.
ఓ వైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు పవన్‌కల్యాణ్. ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ కొన్ని రోజులు ఆయన సినిమాలకు బ్రేక్ ఇస్తారని చాలామంది భావించారు. అందరి అంచనాలనూ తల్లకిందులుచేస్తూ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌కి రెడీ అయిపోయారు పవన్‌కల్యాణ్. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 20న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మొదలవ్వనుందని తెలుస్తున్నది.
పవన్‌కల్యాణ్, ముఖ్య తారాగణంపై కీలకసన్నివేశాలను దర్శకుడు హరీశ్‌శంకర్ తెరకెక్కించనున్నట్టు సమాచారం. పవన్‌కల్యాణ్, హరీశ్‌శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ వీళ్లిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందుకు తగ్గట్టే ‘గబ్బర్‌సింగ్’ని మించే స్థాయిలో అత్యంత శక్తివంతంగా ఇందులో పవర్‌స్టార్ పాత్రను రాసుకున్నారట హరీశ్‌శంకర్. శ్రీలీల, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

