నువ్వేకావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావు వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సీనియర్ దర్శకుడు విజయ్ భాస్కర్. తాజాగా ఆయన ‘ఉషా పరిణయం’ పేరుతో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని తెరకెక్కించబోతున్నారు. ‘లవ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఉపశీర్షిక. మంగళవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ప్రధాన పాత్రల్ని పోషించనున్నారు. అలీ, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, దర్శకత్వం: కె.విజయ్ భాస్కర్.