స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి.. ఈ సినిమాలు దర్శకుడిగా కె.విజయభాస్కర్ ఏంటో చెప్పాయి. కొంత విరామం తర్వాత మళ్లీ ఓ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టారు కె.విజయభాస్కర్. సినిమా పేరు ‘ఉషాపరిణయం’. తన తనయుడు శ్రీకమల్ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో విజయభాస్కర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాన్వీ ఆకాంక్ష అనే తెలుగమ్మాయి ఇందులో కథానాయిక.
శనివారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘ప్రేమకు సరైన నిర్వచనం చెప్పే సినిమా ఇది. ప్రేమికులకు ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది. అన్ని ఎమోషన్సూ ఇందులో ఉంటాయి. సాంకేతికంగా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు ధృవన్ విశ్వరూపాన్ని ఇందులో చూస్తారు.
నా కుమార్తె శ్యామల హీరోహీరోయిన్లకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేయడమేకాక, ప్రొడక్షన్ విషయం ఎంతో హెల్ప్ చేసింది. ఇక కమల్ ఇందులోని హీరో పాత్రకు వందశాతం న్యాయం చేశాడు’ అని చెప్పారు కె.విజయభాస్కర్. ఇంకా హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందం కూడా మాట్లాడారు. అలీ, వెన్నెలకిశోర్, సూర్య, రవి, శివతేజ, శివాజీరాజా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల.