Urvashi Rautela | ఎన్బీకే 109 మూవీ షూటింగ్లో గాయపడ్డ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా..!
Urvashi Rautela | బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతున్నది. అయితే, షూటింగ్లో ఊర్వశి తీవ్రంగా గాయపడిందని.. దాంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
Urvashi Rautela | బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతున్నది. అయితే, షూటింగ్లో ఊర్వశి తీవ్రంగా గాయపడిందని.. దాంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘ఎన్బీకే 109’. ఈ చిత్రంలో కీలకపాత్రలో ఊర్వశి నటిస్తున్నది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ సైతం కనిపించనున్నారు. ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశికి ఫ్రాక్చర్ అయ్యిందని.. అప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీమ్ తెలిపింది. ఎన్బీకే 109 మూవీ మూడో షెడ్యూల్ కోసం ఊర్వశి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిందని ఆమె బృందం పేర్కొంది.
ప్రస్తుతం ఊర్వశి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలియాల్ని ఉన్నది. బాలకృష్ణ-బాబి కాంబోలో ఈ మూవీ తెరకెక్కుతున్నది. ‘ఎన్బీకే 109’ వర్కింగ్ టైటిల్. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ మూవీలో ఊర్వశి రౌటెలాతో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా, మ్యూజిక్ సంచలనం ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఊర్వశి ప్రస్తుతం బాలకృష్ణ మూవీతో పాటు సన్నీ డియోల్ ‘బాప్’.. మిథున్ చక్రవర్తి, సంజయ్‌దత్, రణదీఫ్ హుడాతో ‘ఇన్స్పెక్టర్ అవినాశ్-2’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

