Kantara 2 | బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా ఇప్పుడు సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాసు.. వేర్ ఈజ్ ది పార్టీ అంటూ ఆడిపాడింది. ఇప్పుడు రామ్ పోతినేనితో కలిసి స్టెప్పులు వేసేందుకు రెడీ అయ్యింది. ఇది కాకుండా తమిళంలో శరవణన్‌తో కలిసి ది లెజెండ్ సినిమాలోనూ నటించింది. ఇలా సౌత్ సినిమాలపై ఫోకస్ చేసిన ఊర్వశి రౌతెలాకు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలినట్టు సమాచారం. కాంతారా 2 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.
హోంబలే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార సంచలన విజయం సాధించింది. కన్నడలో చిన్న సినిమాగా వచ్చి.. పాన్ ఇండియా రేంజ్లో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా విజయంతో తొందరలోనే కాంతార 2 ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయిపోయింది. అయితే ఇది కాంతార చిత్రానికి సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్. అంటే కాంతార సినిమా ఎక్కడైతే మొదలైందో.. దానికి ముందు ఏం జరిగిందనేది ఇందులో చూపించబోతున్నారు. ఈ క్రమంలో కాంతార 2 చిత్రంలో నటించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఊర్వశి రౌతెలా తెలిపింది. ఈ మేరకు రిషబ్ శెట్టితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కాంతార 2 లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.