Urvashi Rautela | ఎవరిని ఉద్ధరించటానికి హీరోయిన్ పాత్రలు?
ఐటెం సాంగ్స్ చేసుకోవడం హాయిగా ఉంది. ఎవరిని ఉద్ధరించటానికి హీరోయిన్ క్యారెక్టర్లు?.. అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నది ఈ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా. ఈ మధ్య ఈ అందాలబొమ్మకు హీరోయిన్ ఆఫర్లు తెగ వచ్చేస్తున్నాయంట.
Urvashi Rautela | ఐటెం సాంగ్స్ చేసుకోవడం హాయిగా ఉంది. ఎవరిని ఉద్ధరించటానికి హీరోయిన్ క్యారెక్టర్లు?.. అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నది ఈ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా. ఈ మధ్య ఈ అందాలబొమ్మకు హీరోయిన్ ఆఫర్లు తెగ వచ్చేస్తున్నాయంట. వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఆమె తిప్పి కొడుతున్నదట. ఇంత అందాన్ని పెట్టుకొని ఐటమ్‌సాంగ్స్ అవసరమా? చక్కగా హీరోయిన్ అయిపోవచ్చుకదా? అనడిగితే ‘నిజానికి నాకు ఆఫర్లు చాలా వచ్చాయి, వస్తున్నాయి కూడా. కానీ నాకు హీరోయిన్ పాత్రలపై అంత ఇంట్రస్ట్ లేదు. ఇప్పుడు స్టార్ హీరోల సరసన ఐటమ్ సాంగ్స్ చేస్తున్నాను.
రేపు హీరోయిన్ అయితే, చిన్న చిన్న హీరోలతో నటించాలి. గుర్తింపులేని చిన్న దర్శకులతో పనిచేయాలి. తీరా ఆ సినిమాల ఫలితం సరిగ్గా రాకపోతే, ఆ ప్రభావం నాపై పడుతుంది. అవసరమా? చెప్పండి. చక్కగా పెద్ద పెద్ద హీరోలతో అడుగు కలుపుతూ, పెద్ద పెద్ద దర్శకులతో కలిసి పనిచేస్తున్నాను. ఒక్క రోజులో షూటింగ్ అయిపోతుంది. నా డబ్బులు నాకిచ్చేస్తారు. నా స్టార్‌డమ్‌కి తగ్గ పారితోషికమే ఉంటుంది. దానికితోడు బోల్డంత టైము. ఇంకెందుకంట హీరోయిన్ పాత్రలు?!’ అంటూ తెలివిగా సమాధానమిచ్చింది ‘ ఊర్వశీ రౌటేలా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

