Ugram | ఉగ్రం సినిమా కోసం రోజుకు 18 గంటలు పనిచేశాం : అల్లరి నరేశ్
Allari Naresh | అల్లరి నరేశ్ (Allari Naresh) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). విజయ్ కనకమేడల (vijaykanak medala) డైరెక్ట్ చేస్తున్న ఉగ్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
Allari Naresh | కామెడీ సినిమాలతో అలరించడమే కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తుంటాడు అల్లరి నరేశ్ (Allari Naresh). ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). నాంది ఫేం విజయ్ కనకమేడల (vijaykanak medala) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఉగ్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
‘ఉగ్రం నా 60వ సినిమా. అల్లరి నుంచి ఇప్పటివరకు నా డైరెక్టర్లలందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాంది సినిమా విషయంలో మాకు ఎక్కువ అంచనాలేమి లేవు. మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. ఉగ్రం విషయానికొస్తే అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలు అందుకునేందుకు చాలా కష్టపడ్డాం. విజయ్ కనకమేడలతో చేయబోతున్న మూడో సినిమాకు కూడా ఇదే టీం కొనసాగుతుందనుకుంటున్నా. మా ఇతర కమిట్మెంట్స్ పూర్తయ్యాక నరేశ్విజయ్ 3 ప్రాజెక్ట్ మొదలవుతుంది.
సాహు-హరీష్ బడ్జెట్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మేమంతా ఉగ్రం సినిమా కోసం రోజుకు 16-18 గంటలు పనిచేశాం. నేనింతకు ముందు ఎమోషన్స్‌తో కూడిన ఫైట్స్ చేయలేదు. ఆ ఇంటెన్సిటీని మొదటిసారి చూస్తారు. మిర్ణా మీనన్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని’ చెప్పుకొచ్చాడు అల్లరి నరేశ్.
డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. ఈ సినిమాను 73 రోజుల్లో షూట్ చేయగా.. వీటిలో 53 రోజులు రాత్రుల్లోనే షూట్ చేశామన్నాడు. బడ్జెట్ పెరిగినా నిర్మాతలు తనను చాలా సపోర్ట్ చేశారని చెప్పాడు. అల్లరి నరేశ్ తనపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారని, యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు.
ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఉగ్రం ట్రైలర్..
Read Also :
Japan | హైదరాబాద్‌లో కార్తీ టీం.. జపాన్ నయా అప్డేట్
NTR 30 | క్రేజీ న్యూస్.. ఎన్టీఆర్ 30లో సీరియల్ నటి..!
Chatrapathi Trailer | స్టైలిష్ మాస్ అవతార్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఛత్రపతి ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

